2010

చిరు చిరు చిరు

chiru chiru chiru

🎬 Awara
చిరు చిరు చిరు
Advertisement
చిరు చిరు చిరు చినుకై కురిశావే మరుక్షణమున మరుగై పోయావే నువ్వే ప్రేమబాణం నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం చెయ్ చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయము పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే ఎదనే నీతో ఎత్తుకెళ్ళావే చిరు చిరు చిరు చినుకై కురిశావే మరుక్షణమున మరుగై పోయావే
Advertisement

దేవత తనే ఒక దేవత.. ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా గాలిలో తనే కదా పరిమళం చెలి సఖి అనుమతే అడగకా పువ్వులే పూయునా సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళ గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరిచే చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమెయ్యాల చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే చెయ్ చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయము పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే
తోడుగా ప్రతిక్షణం వీడక అనుక్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందన నేలపై పడేయక నీడనే చకా చకా చేరనా ఆపనా గుండెలో చేర్చనా దారం బదులు ప్రాయంతోనే కట్టేసిందే గాయం లేక కోసేసిందే హాయిగా నవ్వేసిందే నాలో నేను మౌనంగానే మాటాడేస్తే మొత్తం తను వింటూ ఉందే తియ్యగా వేదిస్తుందే ఎదనే తనతో ఎత్తుకెల్లిందే చెయ్ చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయము పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే
చిరు చిరు చిరు చినుకై కురిశావే మరుక్షణమున మరుగై పోయావే చిరు చిరు చిరు చినుకై కురిశావే మరుక్షణమున మరుగై పోయావే
Cast & Crew
🎤SingersHaricharan ,  Tanvi Shah
✍️LyricsChandrabose
⭐HeroKarthi
💫HeroineTamannaah Bhatia
🎬DirectorN. Lingusamy