2003

నీ స్టయిలే నాకిష్టం

nee styele nakishtam

🎬 Raghavendra
నీ స్టయిలే నాకిష్టం
Advertisement
నీ స్టయిలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నా కోసం ఇక సంతోషం
Advertisement

అంతొద్దులేమ్మ ఈ స్నేహం చాలమ్మ నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే తరుముతున్నది నీకేసి తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నా పేరే
నీ స్టయిలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నా కోసం ఇక సంతోషం
నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా పలకకున్న సరే నీపై మోజు కలిగెలేరా
అందరి తీరుగా నేను తెలుగు కుర్రాణ్నిగా ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమ చాలిక
నీ మగసిరి నడకలలోనా తెలియని మత్తేదో ఉందిరా అది నన్ను తడిపి ముద్ద చేసే
పగలే కల కంటున్నావో కలవరింతలో ఉన్నావో ఊహ నుండి బయటకు రావమ్మో
నీ స్టయిలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నా కోసం ఇక సంతోషం
నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చేలా
ప్రేమనే గుడ్డిది అంటే నమ్మలేదెన్నడు నమ్మక తప్పదు నిన్నే చూసా ఇప్పుడు
నీ కంటి బొమ్మల విరుపు నీచులపై కొరడా చరుపు అది నీపై వలపె కలిపెరా
పూవంటి హృదయంలోనా తేనంటి మనసే నీది నీ ప్రేమకు ఇదిగో జోహారే
నీ స్టయిలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నా కోసం ఇక సంతోషం
అంతొద్దులేమ్మ ఈ స్నేహం చాలమ్మ నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే తరుముతున్నది నీకేసి తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నా పేరే
నీ స్టయిలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నా కోసం ఇక సంతోషం
Cast & Crew
✍️LyricsSuddala Ashok Teja
🎵MusicMani Sharma
⭐HeroPrabhas
💫HeroineAnshu , Shweta Agarwal
🎬DirectorSuresh Krishna