2005

ఒకే ఒక మాట

oke okamaata

🎬 Chakram
ఒకే ఒక మాట
Advertisement
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా
Advertisement

నా పేరు నీ ప్రేమని నా దారి నీ వలపని నా చూపు నీ నవ్వని నా ఊపిరే నువ్వని నీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా
నేను అని లేను అని చెబితే ఎం చేస్తావు నమ్మనని నవ్వుకొని చాల్లే పోమంటావు
నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని నీ తనువులోని స్పర్శగా తగిలేది నేనని
నీ కంటిమైమరుపులో నను పోల్చుకొంటానని తలా ఆంచి నీ గుండెపై నా పేరు వింటానని నీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా
నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువ్వు రాకముందు జీవితం గురుతైనా లేదని నిను కలుసుకున్న ఆ క్షణం నను వొదిలిపోనని
ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నానని ఈ మహిమ నీదేనని నీకైనా తెలుసా అని నీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమని నా దారి నీ వలపని నా చూపు నీ నవ్వని నా ఊపిరే నువ్వని నీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా
Cast & Crew
🎤SingersChakri
🎵MusicChakri
⭐HeroPrabhas
💫HeroineAsin , Charmme Kaur
🎬DirectorKrishna Vamsi